హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గత అభివృద్ధిని చూసి ఓటు వేయండి: మాజీ ఎంపీ

E.G: రాజమండ్రి నగరంలోని మూడు వార్డుల్లో YCP కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా శుక్రవారం మాజీ MP మార్గాని భరత్ ప్రచారం చేశారు. కొత్త 2వ వార్డు అభ్యర్థి కొల్లంగి అన్నపూర్ణ, 72వ వార్డు అభ్యర్థి బర్రె శాంతికుమారి, 53వ వార్డు అభ్యర్థి ధామరసింగు శ్రీదేవి తరఫున ఓటర్లను కలిశారు. గతంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, గెలిపించాలని కోరారు.