KKD: పిఠాపురం మండలం విరవాడ గ్రామ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైనట్లు సమాచారం. జనసేన, TDP, BJP పార్టీలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా కూరాకుల కృష్ణవేణి రాంబాబు ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కాగా, మరో అభ్యర్థి నుంచి నామినేషన్ నమోదు కాకపోవడంతో విరవాడ గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
విరవాడ సర్పంచ్ పదవి ఏకగ్రీవం?


