హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదకాకాని ఆలయ అర్చకుడు జాలయ్య ఆకస్మిక మృతి

GNTR: పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానం ఉప ప్రధాన అర్చకుడు చదలవాడ జాలయ్య ఆకస్మికంగా కన్నుమూశారు.ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేసినట్లు ఆలయ ఉప కమిషనర్, ఈవో పి. శ్రీనివాసులు రెడ్డి, పాలకమండలి ఛైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. ఆయన మృతి పట్ల ఈవో, ఛైర్మన్‌తో పాటు పాలకమండలి సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.