హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడపలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కడప నగరంలోని 34/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. నెహ్రూనగర్, ఎన్జీవో కాలనీ, చిన్నచౌక్, మాసాపేట, శంకరాపురం, మారుతీనగర్ తదితర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. హర్షనాయక్ తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.