హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చౌడేశ్వరీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

NDL: బనగానపల్లె మండలం నందవరంలోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనతో పాటు వివిధ పూజా కార్యక్రమాలు ఘనంగా చేపట్టారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.