హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోలర్ స్కేటింగ్‌లో చిన్నారి ప్రతిభ

VSP: పెదగంట్యాడకు చెందిన హిమాన్షి (7) రాష్ట్ర రోలర్ స్కేటింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కోచ్ మురళి తెలిపారు. విశాఖలో 11 నుంచి 14 వరకు జరిగిన పోటీల్లో అండర్ 6-8 విభాగంలో 80 మందిలో ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించాడన్నారు. జిల్లాలో రెండు బంగారు పతకాలు పొందాడన్నారు. వచ్చే నెల బెంగళూరు జాతీయ పోటీలకు అర్హత సాధించాడన్నారు. పలువురు అభినందించారు.