హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 23న మెగా జాబ్ మేళా

CTR: వీ.కోట సీవీఆర్ఎం డిగ్రీ కళాశాలలో ఈనెల 23వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, నేషనల్ కేరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు హజరై 350కి పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పదవ తరగతి, డిప్లమా, డిగ్రీ చదివిన వారు అర్హులని తెలిపారు.