NLR: ఉదయగిరి పోస్ట్ ఆఫీస్ వీధికి చెందిన షేక్ రసూల్ (37) బైక్‌పై వెళ్తుండగా కోళ్ల వీధి మలుపు వద్ద ఒక్కసారిగా కిందపడి మృతి చెందారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వరికుంటపాడులో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న రసూల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
బైక్‌పై వెళ్తూ కుప్పకూలి వ్యక్తి మృతి


