హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ ఉపసంహరణకు నేడే చివరి తేదీ

పల్నాడు జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు. ఇప్పటికే పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరి రోజు కావడంతో ఉపసంహరణల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా వెల్లడికానుంది.