హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ

అన్నమయ్య: రామసముద్రంలో మూడో విడతలో భాగంగా రేపు జరగనున్న సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో మదనపల్లె డీఎస్పీ బి.ప్రసాద్ మండలంలోని ఆరు నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటుచేసి, భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందికి సూచించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు క్యూలైన్లు పాటించాలని కోరారు.