హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగావళి నదిలో పడి బాలుడు గల్లంతు

శ్రీకాకుళంలో నాగావళి నదిలో బాలుడు గల్లంతయ్యాడని తల్లి పార్వతి పోలీసులకు శుక్రవారం తెలిపారు. నాగావళి నదికి స్నేహితులతో వెళ్లిన పుక్కల్ల హర్ష (11) కాలు జారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తోటి పిల్లలు గుర్తించేలోపే గల్లంతయ్యాడు. సీఐ రామకృష్ణ, ఎస్సై హరికృష్ణ, గజ ఈతగాళ్లు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.