హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మక్కపేటలో సర్పంచ్ పోటీలో 21 మంది అభ్యర్థులు

NTR: వత్సవాయి మండలం మక్కపేట గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో ఈ సారి రికార్డు స్థాయిలో 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గత 41 సంవత్సరాల గ్రామ చరిత్రలో ఇంతమంది పోటీ చేయడం ఇదే మొదటిసారి. మొత్తం 12 వార్డులున్న ఈ గ్రామంలో సర్పంచ్ పదవికి ఇంతమంది ముందుకు రావడం గ్రామ ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది.