హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాదకద్రవ్యాల కట్టడికి ప్రత్యేక చర్యలు: సీపీ

ఎన్టీఆర్ జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు అన్నారు. డ్రగ్స్‌పై నిర్వహించిన సమీక్షలో 2025లో 137 ఎన్డీపీఎస్ కేసులు, ఈ ఏడాది ఇప్పటివరకు 52కేసులు నమోదైనట్లు వెల్లడించారు. 149 హాట్‌స్పాట్‌లపై నిఘా ఏర్పాటు చేసి, 42 మందిపై PIT NDPS కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.