హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆంజనేయ స్వామి సన్నిధిలో సామూహిక పూజలు

కృష్ణా: కృత్తి వెన్ను మండలం పాశ్చాపురంలోని శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి దేవస్థానంలో 15వ వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సామూహిక మహాలక్ష్మీ ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ అర్చక స్వామి హనుమంతాచార్యులు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా సాగుతుండగా, పాల్గొన్న ముత్తైదువులచే సామూహిక కుంకుమ పూజ జరిపించారు.