హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లూరి జడ్పీ పీఠం వైసీపీదే..!

అల్లూరి జిల్లా పరిషత్ నూతన ఛైర్‌పర్సన్‌గా పెదబయలు మండలానికి చెందిన వైసీపీ జడ్పీటీసీ సభ్యురాలు వంతల శాంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ టి. నిశాంతి అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల్లో 11 మంది సభ్యులకు గాను ఏడుగురు ఆమెకు మద్దతు తెలిపారు. అలాగే, వైస్ ఛైర్మన్‌గాసీదరి రాంబాబు ఎన్నికయ్యారు.