AKP: యలమంచిలి పురపాలక సంఘంలో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఛైర్‌పర్సన్, వార్డు సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. పురపాలక సంఘ కార్యాలయ కౌన్సిల్ హాలులో ఈ సమావేశం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
23న ప్రత్యేక సమావేశం


