VZM: డెంకాడ మండలం మోదవలస గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెల్లాం గ్రామానికి చెందిన మల్లాపురెడ్డి జగన్(16) రోడ్డు దాటుతుండగా విజయనగరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు తగరపువలస సమీపంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి


