హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తి ఆర్టీసీ బస్టాండులో దుకాణాల తొలగింపు

ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్ పునర్ నిర్మాణంలో భాగంగా శుక్రవారం ఆర్టీసీ ఆవరణలో ఉన్న దుకాణ సముదాయాలను అధికారులు జేసీబీతో తొలగించారు. నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న పాత ఆర్టీసీ బస్టాండ్ ను కూల్చివేసి నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులు చేపడతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.