అన్నమయ్య: పుల్లంపేట (మం) దలవాయిపల్లి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ బాలల దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను రంగురంగుల అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. విద్యార్థులకు ఆటలు, పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదభరిత పోటీలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో ఘనంగా ప్రపంచ బాలల దినోత్సవం


