హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫీజు బకాయిల కోసం విద్యార్థుల నిరసన

GNTR: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, AISF నాయకులు గుంటూరు కొత్తపేటలోని భగత్‌సింగ్ విగ్రహం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.