హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్ సమీక్ష

చిత్తూరులో కలెక్టర్ సుమిత్ కుమార్, డీఆర్వో మోహన్ కుమార్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మూడో విడత సర్పంచ్ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నేతల సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. అందరూ తమకు సహకరించాలని కోరారు.