హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ కార్యాలయంలో లీగల్ సెల్ ఏర్పాటు

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గంలో రేపటి నుంచి సర్పంచ్ 3వ విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా లీగల్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సక్రమంగా పూర్తి చేసుకునేందుకు లీగల్ టీమ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.