ATP: ఐదుకల్లు పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య శుక్రవారం పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు వైసీపీ శ్రేణులు, గ్రామస్తులు స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు. వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోయ కమలమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తలారి రంగయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తలారి రంగయ్య


