హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీ–హబ్‌‌లో మొరాయిస్తున్న యంత్రాలు

NRML: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు గత ప్రభుత్వం అన్ని జిల్లాల్లో టీ-హబ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లాలో ఓవైపు వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండగా, టీ–హబ్‌‌లోని యంత్రాలు తరచూ మొరాయించడం రోగులకు శాపంగా మారుతోంది. దీంతో పేదలు వ్యాధి నిర్ధారణకు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు.