హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హెల్మెట్ పోలీసుల కోసం కాదు, మీ ప్రాణాల కోసం

HYD: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 'X' వేదికగా విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ ధరించడం పోలీసుల కోసం కాదని, అది మీ ప్రాణ రక్షణ కోసమేనని స్పష్టం చేశారు. రైడర్‌తో పాటు వెనుక కూర్చునే పిలియన్ రైడర్ కూడా విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. మీ భద్రతే మీ కుటుంబానికి నిజమైన భరోసా అని పేర్కొన్నారు.