హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టులో ఉచిత వైద్య శిబిరం

JGL: డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాత ఆదేశాల మేరకు శుక్రవారం మల్యాల మండలం కొండగట్టులో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ వైద్యుడు డాక్టర్ రవిశంకర్, డాక్టర్ శ్రీజ ఉన్నారు.