MHBD: తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన శివరాత్రి నాగవద్ది రాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతనితో చదువుకున్న తోటి స్నేహితులు కలిసి పోగుచేసిన రూ.81,500 లను మృతుడి భార్య హైమాకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమ తోటి స్నేహితుడిని కోల్పోవడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
తెలంగాణ
'స్నేహితుడి కుటుంబానికి అండగా తోటి స్నేహితులు'


