హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొత్స కోటలో మేనల్లుడి కొత్త రాజకీయం!

VZM: జిల్లాలో కొత్త రాజకీయం మొదలైంది. మాజీమంత్రి బొత్స సత్యనారాయణకు సన్నిహితుడిగా ఉన్న ఆయన మేనల్లుడు మజ్జి శ్రీను జిల్లాపై పట్టు సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన శ్రీను.. జడ్పీ పీఠాన్ని దక్కించుకున్నారు. జడ్పీ చైర్ పర్సన్ గా ఆయన కుమార్తె సిరి సహస్ర ఖరారైంది. దీంతో జిల్లా రాజకీయాలను శాసించిన బొత్సకు శ్రీను సవాల్ గా మారారని రాజకీయ వర్గాల్లో టాక్.