హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏలూరులో ప్రమాదకరంగా కల్వర్టు

ELR: ఏలూరు నగరం సత్రంపాడు వైఎస్సార్ విగ్రహం సమీప ప్రధాన రహదారిపై కల్వర్టు ప్రమాదకరంగా మారింది. రెండు వైపులా రక్షణ గోడలు లేకపోవడంతో.. వాహనదారులు, ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా డ్రెయిన్‌లో పడే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.