మన్యం: ప్రసూతి సెలవుపై వెళ్తున్న మహిళా కానిస్టేబుల్ మంగమ్మకు పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది అపురూపమైన వీడ్కోలు పలికారు. ఆమెను తమ ఇంటి ఆడబిడ్డగా భావించి, పట్టణ సీఐ బి.వెంకట్రావు ఆధ్వర్యంలో స్టేషన్ ఆవరణలో సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుక నిర్వహించారు. తోటి సిబ్బంది చూపిన ఆప్యాయత, ప్రేమకు మంగమ్మ ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌కు సీమంతం వేడుక


