హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ బరిలో మాజీ ఉప సర్పంచ్ సతీమణి

NDL: సంజామల సర్పంచ్ పదవికి నామినేషన్లు జోరందుకున్నాయి. రెండో రోజు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఉప సర్పంచ్ గాజుల వాహబ్ తన సతీమణి మెహరూన్‌బితో టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయించారు. టీడీపీ నేత అలీ హుస్సేన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రామ అభివృద్ధి కోసం టీడీపీ సర్పంచ్ అభ్యర్థి మెహరూన్‌బిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.