హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాజువాకలో యాక్సిడెంట్ వ్యక్తికి తీవ్ర గాయాలు

VSP: గాజువాక 38వ బస్టాప్ ఎదురుగా శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయమవడంతో వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.