హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి కొండగట్టు స్వామివారి నిజరూప దర్శనం

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి చందనోత్సవం నేటితో ముగియనుంది. మహాసంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తారు. చందనోత్సవంలో భాగంగా స్వామివారి మూల విరాట్ కు గతంలో అలకరించిన చందనాన్ని శాస్త్రోక్తంగా తొలగించారు. చందనాన్ని తూకం వేయగా.. 99 కిలోల 720 గ్రాముల బరువు నమోదైంది. భక్తుల రద్దీ భద్రతా దృష్ట్యా ఎస్పీ అశోక్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.