హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్ఐటీ-కిట్స్ ఒప్పందం పునరుద్ధరణ

వరంగల్ ఎన్ఐటీ, కిట్స్ సంస్థలు పరస్పర విద్యా, పరిశోధన సహకారానికి ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నాయి. ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొ. బిద్యాధర్ సుబుధి, కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొ. అశోక్ రెడ్డి సంతకాలు చేశారు. ఉమ్మడి పరిశోధనలు, విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌లు, అధ్యాపకుల మార్పిడికి వీలుంది. ఇప్పటికే రూ.88.71 లక్షల నిధులు, 23 ఉమ్మడి పరిశోధన పత్రాలు వచ్చాయి.