హైదరాబాద్: 28°C
తెలంగాణ

12 గంటల్లో చిన్నారి కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు

HYD: హైదరాబాద్ అమీన్ పూర్‌లో అపహరణకు గురైన రెండున్నరేళ్ల చిన్నారి అక్షితను సైబరాబాద్ పోలీసులు 12 గంటల్లోనే సురక్షితంగా కాపాడి తన తల్లి వద్దకు చేర్చారు. ఈ కేసులో మెదక్ జిల్లాకు చెందిన గంగమణి (44) అనే మహిళను అరెస్టు చేశారు. సీసీటీవీ పుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితురాలిని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నారాయణ్‌ఖేడ్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.