హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక ఏకాదశికి వెంకన్న ఆలయానికి భక్తుల తాకిడి

AKP: కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా నర్సీపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో దర్శనానికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.