హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన MPDOగా తోట హరీష్

MHBD: ఇనుగుర్తి మండల నూతన ఎంపీడీవోగా తోట హరీష్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఇంఛార్జ్ ఎంపీడీవోగా పనిచేసిన పార్థసారధి పెద్దవంగరకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో హరీష్ మాట్లాడుతూ... మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందిస్తానని తెలిపారు.