ADB: జిల్లాలో DSC-2024 ద్వారా నియమితులైన ఉపాధ్యాయుల రెండేళ్ల సేవలు పూర్తయినందున, ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు త్వరితగతిన జారీ చేయాలని PRTU TS జిల్లా నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ DEO మాధవిని గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయుల రెండో వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్ మంజూరులో జాప్యం జరగకుండా చూడాలని విన్నవించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ చేయాలి: PRTU TS


