హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద విద్యార్థిని చదువుకు మంత్రి ఆర్థిక సాయం

BHNG: మోత్కూరు మండలానికి చెందిన నిరుపేద విద్యార్థిని ఏ.రజిని ఎంబీబీఎస్ చదువు పూర్తి చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేని పరిస్థితిని గురువారం మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మిగిలిన మూడేళ్ల ఎంబీబీఎస్ ఫీజు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.