హైదరాబాద్: 28°C
తెలంగాణ

కువైట్‌లో గుండెపోటుతో జగిత్యాల వాసి మృతి

JGL: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన మరిపెల్లి సత్యనారాయణ (55) కువైట్‌లో గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం రాత్రి గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం గురువారం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.