SRCL: వేములవాడలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల అర్హులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నారు. ఇందుకోసం 28 వార్డుల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ లోకేష్ తెలిపారు. అర్హులు రేషన్ కార్డు, ఆధార్, నామినీ ఆధార్, మొబైల్ నంబరుతో కేటాయించిన కేంద్రంలో నమోదు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
నేటి నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు


