MBNR: మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరు గేట్ వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్టు రూరల్ ఎస్సై విజయ్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. మృతుడికి 60 సంవత్సరాల వయసు ఉంటుందని, తెల్లని జుట్టు, గడ్డం ఉన్నాయన్నారు. కుడి చేతికి తెల్లని కడియం ధరించి ఉన్నాడన్నారు. ఎవరైనా మృతుడిని గుర్తిస్తే రూరల్ ఎస్సై ఈ నంబర్ 8712659336 ను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
కోడూరు గేటు వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం


