హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో విద్యుత్ కాంట్రాక్టర్ మృతి

ASF: తిర్యాణి మండలానికి చెందిన విద్యుత్ కాంట్రాక్టర్ గంధే సత్యనారాయణ రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తిర్యాణి మండలంలో విద్యుత్ కాంట్రాక్టర్‌గా సేవలందిస్తున్న ఆయన, బెల్లంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో మండలంలో విషాదం నెలకొంది.