హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై సమీక్ష

KNR: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు నగరంలో 32 ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 66 డివిజన్ల పరిధిలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శిబిరాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.