NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లాలో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. ఇటు కామారెడ్డి జిల్లాలో 9°C ల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అవుతుందని, అటు నిజామాబాద్ జిల్లాలో 9.6°Cల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ
ఉమ్మడి జిల్లాలో చలి పంజా.... జాగ్రత్త


