NLG: జిల్లాకు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ కంది భజరంగ్ ప్రసాద్ రాష్ట్ర ఉత్తమ ఫొటో జర్నలిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మీడియా అకాడమీ ఛైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఆయన ఎంపిక పట్ల జర్నలిస్టు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ
భజరంగ్ ప్రసాద్‌కు ఉత్తమ అవార్డు


