హైదరాబాద్: 28°C
వార్తలు

అఖిలేష్ యాదవ్ ర్యాలీలో విషాదం

యూపీ గోరఖ్‌పూర్‌లో ఎస్పీ అధినేత అఖిలేష్ నిర్వహించిన పాదయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ర్యాలీలో అఖిలేష్‌పై పూలు చల్లుతూ వేగంగా వస్తున్న బుల్డోజర్ స్థానిక బీజేపీ నాయకుడి 14ఏళ్ల కుమారుడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ బాలుడు మృతి చెందాడు. ఊరేగింపులో నిర్వహణ లోపం కారణంగానే తమ కుమారుడికి ప్రమాదం జరిగిందని.. వెంటనే అఖిలేష్‌పై కేసు నమోదు చేయాలని తండ్రి డిమాండ్ చేశాడు.