హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం

ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని హిమాచల్ ప్రదేశ్ మంత్రి జగత్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. భారత సాయుధ దళాలను అవమానించేలా మంత్రి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే భారత ఆర్మీకి మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మంత్రికి పాక్ అనుకూల అభిప్రాయాలు ఉంటే వెంటనే ఆయన లాహోర్ వెళ్లిపోవాలని సూచించింది.