హైదరాబాద్: 28°C
వార్తలు

బయోడీజిల్ బ్లెండింగ్‌పై వదంతులకు చెక్

డీజిల్‌లో బయోడీజిల్ కలిపే ప్రక్రియపై వస్తున్న ఊహాగానాలకు చమురు సంస్థలు చెక్ పెట్టాయి. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో మొత్తం 4,900 కోట్ల లీటర్లు హై-స్పీడ్ డీజిల్ విక్రయాలు జరగగా.. ఇందులో 4,700 కోట్ల లీటర్లకు పైగా డీజిల్‌లో ఎలాంటి బయోడీజిల్ కలపలేదని వెల్లడించింది. మిగిలిన 200 కోట్ల లీటర్ల డీజిల్‌లో 4 కోట్ల లీటర్ల బయోడీజిల్ కలిపినట్లు తెలిపింది.