హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో రోడ్డు ప్రమాదాల బీభత్సం

SRPT: జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 590 రోడ్డు ప్రమాదాలు జరిగి 209 మంది మరణించారు, 604 మంది గాయపడ్డారు. సగటున వారానికి 12 ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో 138 మంది ద్విచక్ర వాహనదారులే. జిల్లాలో 43 బ్లాక్‌స్పాట్లను గుర్తించామని, ఎస్పీ కొత్తపల్లి నరసింహ తెలిపారు. గ్రామాల్లో రోడ్డు భద్రతా కమిటీలు ఏర్పాటు చేశారు.